ఉక్రెయిన్ రిటర్న్ విద్యార్థులకు కేసీఆర్ శుభవార్త
- March 15, 2022
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లో మెడిసిన్ చేసేందుకు వెళ్లిన విద్యార్థులు అంతా తిరిగి సొంత ప్రాంతాలకు చేరుకున్నారు.. యుద్ధం ప్రారంభానికి ముందే వచ్చినవారు ఈజీగా గమ్యం చేరినా.. యుద్ధం ప్రారంభం అయ్యేవరకు అక్కడే ఉన్న విద్యార్థులు మాత్రం కన్న భూమిని చేరడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది.. అయితే, మెడిసిన్ చేసేందుకు వెళ్లి.. యుద్ధంతో మధ్యలోనే రిటర్న్ రావాల్సిన వచ్చిన విద్యార్థులు.. మాకో మార్గం చూపండి అంటూ కేంద్రాన్ని వేడుకుంటారు.. అంతేకాదు.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.. అయితే, ఉక్రెయిన్ రిటర్న్ విద్యార్థులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రాంతం నుంచి ఉక్రెయిన్‌కు 700 మందికి పైగా విద్యార్థులు వెళ్లారని.. అందరూ డాక్టర్లు అవ్వాలనే ఉద్దేశంతోనే ఆ దేశానికి వెళ్లారని.. ఇక్కడ వసతి లేదు కాబట్టి ఆ దేశం పోయారని గుర్తుచేశారు.. ఇక, కింద మీద పడి టికెట్లు మనమే పెట్టి పిల్లల్ని ఇంటికి చేర్చామన్న కేసీఆర్.. మా పిల్లల చదువులకు ఎంత ఖర్చు అయినా సరే మేమే (తెలంగాణ ప్రభుత్వం) భరిస్తుందని స్పష్టం చేశారు.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నామని అసెంబ్లీ వేదికగా వెల్లడించిన కేసీఆర్.. ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్న వారి ఖర్చు భరించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చదువు పూర్తి అయ్యేందుకు వారికి సహకరిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం