పూర్తి డిజిటల్‌గా మారిన సౌదీ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు

- March 15, 2022 , by Maagulf
పూర్తి డిజిటల్‌గా మారిన సౌదీ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని ఓ న్యాయస్థానం పూర్తి డిజిటల్‌గా మారింది. వాడి అల్ దవాసెర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ కోర్టు పూర్తిగా డిజిటల్ విధానంలోనే కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ‘మొయీన్ ఇ-సర్వీస్ వేదికనే ఆయా కార్యకలాపాల నిమిత్తం లబ్దిదారులు, కక్షిదారులు వినియోగించాల్సి వుంటుంది. 20 రకాలకు పైగా న్యాయ సేవలు ఇక్కడ అందుబాటులో వుంటాయి. పిటిషన్లను దాఖలు చేయడం, వాటిని సవాల్ చేయడం.. అన్నీ డిజిటల్ వేదికగానే జరుగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com