బిస్కట్ పై జీడి పప్పు బదులు చనిపోయిన ఈగ దాని గుడ్డు
- April 01, 2016
ఒక స్థానిక దుకాణ సముదాయం వద్ద దుబాయ్ నివాసి ఆఫర్లో బిస్కెట్లు కొనబోతే చనిపోయిన ఒక ఈగ దాని తాలుకా గుడ్లు ఉచితంగా ఆయనకు లభించాయి. 50 ఏళ్ల దుబాయ్ నివాసి రాబర్టో ఘెర్గిఒ ( ఆయన పేరు మార్చబడింది ) ఒక బిస్కెట్లు ప్యాకెట్ తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. దీంతో పురపాలక సంఘంకు ఒక ఫిర్యాదు చేశాడు. స్పందించిన దుబాయ్ మున్సిపాలిటీ బిస్కెట్లు తయారీ సంస్థకు జరిమానా విధించింది. ఈ మార్చి మొదటి వారంలో ఆయన స్థానిక కిరాణా దుకాణ సముదాయం వద్ద " జీడిపప్పు కుకీలు గల ఆరు బిస్కట్ ప్యాకెట్ లు కొనండి...మరో రెండు బిస్కట్ ప్యాకెట్లు ఉచితంగా పొందండి " అనే వాణిజ్య ప్రకటన చూసి ఘెర్గిఒ ఆశపడి వాటిని కొన్నాడు. ఎంత చవక ఎంత చవకని అని రెండు ప్యాకెట్ల ఆనందంగా ఆరగించాడు. ఆ రుచికి ఆగలేక మూడవ బిస్కట్ ప్యాకెట్ తెరిచి ఒక బిస్కెట్లు నోటిలో పెట్టుకోబోతుండగా దానిపై చనిపోయిన ఒక ఈగ, ఈగ గుడ్లు చక్కగా జీడిపప్పు మాదిరిగా అతుక్కుపోయి వెక్కిరిస్తూ ఆయనకు కనబడింది. బిస్కెట్లు ప్యాకేజింగ్ ప్రకారం, సెప్టెంబర్లో ముగిసిపోతున్నట్లు దానిపై ముద్రితమై ఉంది.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం







