జస్టిస్ ఎన్వీ రమణ అధికారిక యూఏఈ పర్యటన..ఘన స్వాగతం పలికిన ప్రవాసీయులు
- March 17, 2022
యూఏఈ: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సతీసమేతంగా యూఏఈ విచ్చేయటం జరిగింది. "ఆర్బిట్రేషన్ ఇన్ ది ఎరా అఫ్ గ్లోబలైసేషన్" పేరిట మార్చి 19న దుబాయ్ లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే నిమిత్తం సీజేఐ దుబాయ్ విచ్చేసారు. జస్టిస్ రమణతో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు డి.వై.చంద్రచూడ్, యల్. నాగేశ్వర రావు, హిమా కోహ్లీ కూడా దుబాయ్ విచ్చేసారు. ఈ సందర్భంగా దుబాయ్ లోని తెలుగు వారు, న్యాయవాదులు, పారిశ్రామకవేత్తలు, వ్యాపారవేత్తలు..జస్టిస్ రమణ దంపతులకు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేశారు.

అనంతరం భారత రాయబార మరియు కాన్సులేట్ అధికారులతో సీజేఐ సమావేశమై తదుపరి కార్యక్రమాలపై చర్చలు జరిపారు.
తమ పర్యటనలో భాగంగా అబుధాబి, దుబాయ్ లోని ఇండియన్ అసోసియేషన్లు నిర్వహించే 'మీట్ & గ్రీట్' కార్యక్రమంలో పాల్గొని ప్రవాసీయులతో జస్టిస్ రమణ ముచ్చటించనున్నారు.
భారత అత్యుత్తమ న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి మన తెలుగువారు కావటం ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారి అందరికి ఎంతో గర్వకారణం..సీజేఐ ను ఇలా దుబాయ్ లో కలుసుకోవటం మాకు ఓ గొప్ప అనుభూతిని మిగిల్చింది అంటూ స్వాగతం పలికేందుకు విచ్చేసిన తెలుగువారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







