అబుధాబి బిగ్ టికెట్ డ్రా లో భారతీయుడికి జాక్‌పాట్..!
- March 19, 2022
అబుధాబి: అబుధాబి బిగ్ టికెట్ డ్రాలో భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. ఖతార్‌లో ఉండే భారత ప్రవాసుడు షంసీర్ పురక్కల్ అబుధాబిలో తాజాగా నిర్వహించిన వీక్లీ ఎలక్ట్రానిక్ డ్రాలో ఏకంగా 3లక్షల దిర్హమ్స్ గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఖతార్ ఉంటున్న షంసీర్ 2017లో యూఏఈలో ఉన్నప్పటి నుంచి అబుధాబి బిగ్‌టికెట్ రాఫెల్ పాల్గొంటున్నట్లు తెలిపాడు.2022 తనకు బాగా కలిసొచ్చిందని చెప్పిన అతడు.. ఏడాది క్రితం తనకు వివాహమైందని, ఇప్పుడు తన భార్య మూడు నెలల ప్రగ్నెంట్ అని చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు భారీ మొత్తం గెలుచుకోవడంతో 2022 ఏడాది తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని మురిసిపోతున్నాడు.ఇక తాను గెలుచుకున్న భారీ మొత్తంలో కొంత భాగాన్ని తన ఎంబీఏ కోర్సును పూర్తి చేసుకోవడానికి ఉపయోగించనున్నట్లు పేర్కొన్నాడు.అటు ఏప్రిల్ 3న బిగ్ టికెట్ వారు తీయనున్న 15 మిలియన్ల దిర్హమ్స్ బిగ్మనీ డ్రా కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఇందులో కూడా తనకు అదృష్టం కలిసి వస్తుందని షంసీర్ ఆశాభావంతో ఉన్నాడు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







