భారీ వర్షాలతో రస్ అల్ ఖైమాలో 67 ప్రమాదాలు
- April 02, 2016
రస్ అల్ ఖైమాలో భారీ వర్షాల కారణంగా 67 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ప్రమాదాలన్నీ చిన్నవే. పెద్ద ప్రమాదాలేవీ సంభవించినట్లు రిపోర్ట్స్ రాలేదు. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామనీ, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జైస్ మౌంటెయిన్‌కి వెళ్ళే రోడ్డుని మూసివేసినట్లు అధికారులు చెప్పారు. వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా వుంటే, వీలైనంతవరకు ఎవరూ రోడ్లపైకి రావొద్దని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు వాహనాల్ని నెమ్మదిగా నడపాలనీ, ప్రమాదకరంగా అనిపిస్తే రక్షిత ప్రాంతాల్లోనే వాహనాల్ని నిలపాలని సూచించారు పోలీసులు. ఎలాంటి ప్రమాదం సంభవించినా వెంటనే 999 మియు 998 నెంబర్లకు తెలియజేయాలన్నారు. వివిధ ప్రాంతాల్లో పోలీసులను, ఇతర భద్రతా సిబ్బందిని, మున్సిపల్ సిబ్బందిని కూడా నియమించారు. ట్యాంక్‌లు, పంప్‌లు అవసరమైన ప్రాంతాలకు తరలించారు. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







