బిచ్చగాడిని వరించిన 6 లక్షల 50 వేల రూపాయల లాటరీ
- April 02, 2016
విన్నారా ...విన్నారా...ఈ వింతను గన్నారా... యాచక పొన్నయ్య శ్రిమంతుడయ్యాడు..అచ్చం అదే మాదిరిగా దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి మంచి జీవనం కోరుతూ కేరళకు వచ్చిన వికలాంగుడైన ఒక 35 ఏళ్ల బిచ్చగాడికి అదృష్టం లాటరీ రూపంలో వరించింది. ఆ వ్యక్తి కేరళ రాష్ట్ర లాటరీ ద్వారా 6 లక్షల 50 వేల రూపాయల (360,237 డి హెచ్ ) నగదును గెలుపొందాడు.
అచ్చం సంబరాల రాంబాబు సినిమాలో చలం మాదిరిగా పొన్నయ్య వేల్లరద శివారులో నివసించే అందరి వద్ద చేయి చాచి అడుక్కొనే అతనికి కేరళ ప్రభుత్వ అక్షయ లాటరీలో 6 లక్షల 50 వేల రూపాయల మొత్తాన్ని గెలుచుకున్నాడు. అదేవిధంగా , లాటరీ పందేలలో ఆడే ఒక సాధారణ వ్యక్తి కూడా బుధవారం జరిగిన డ్రా లో 90,000 రూపాయల మేరకు ఓదార్పు బహుమతులు వరుసలో గెలిచాడు. పోలీసులు ద్వారా విషయం తెలుసుకున్న పొన్నయ్య తండ్రి మరియు సోదరుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి గురువారం ఇక్కడకు వచ్చారు. బహుమతి డబ్బు లావాదేవీ విధానాలు పూర్తయిన తర్వాత ఇంటికి లాటరీ విజేతను తమ వెంట తీసుకువెళ్ళారు. అచ్చం ఇలాంటి సంఘటన మాదిరిగానే గత నెలలో పశ్చిమ బెంగాల్ 22 ఏళ్ల వలస కార్మికుడికి 10 లక్షల రూపాయల కేరళ ప్రభుత్వం లాటరీ గెలుచుకున్నవిషయం మాదరిగానే ఈ బహుమతి పోలి ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లా చెందిన పొన్నయ్య ఒక తాపీ మేస్త్రీ ఒక ప్రమాదంలో తన కాలును కోల్పోయాడు. తన భార్య, ముగ్గురు పిల్లలను పోషించుకోవడానికి విధిలేని పరిస్థితిలో బిక్షగాడిగా మారేడు.ఆ తర్వాత కేరళకు వలస వెళ్ళాడు.వేల్లరద పోలీసు ప్రకారం, ఆయన కేరళ-తమిళనాడు సరిహద్దులో ఉన్న మర్తండంలోని బస్ స్టాండ్ వద్ద అరుగులపై నిద్ర పోవడానికి ఉపయోగిస్తాడు. ప్రజల దగ్గర్ యాచించిన డబ్బు పంపడానికి ఒక బ్యాంకు ద్వారా ఉపయోగించుకొంటాడు. అతని కుటుంబానికి డబ్బు పంపిన తర్వాత సేకరించిన సొమ్ములో ప్రతి నెల ఒక లాటరీ టిక్కెట్లు కొంటుంటాడు.
" పొన్నయ్యకు లాటరీ లో మొదటి బహుమతి గెలుచుకున్నట్లు గ్రహించిన టిక్కెట్లు విక్రేత
( స్థానిక లాటరీ ఏజెంట్ ) పొన్నయ్యకు సంతోషంగా ఈ వార్తను తెలిపాడు. అంతేకాక, అతని భద్రత పరిగణనలోకి తీసుకొని పోలీసు స్టేషన్ కు వెళ్లి సబ్ ఇన్స్పెక్టర్ డి శిబు కుమార్ కు ఈ సంగతిని లాటరీ ఏజెంట్ తెలియచేసాడు. పోలీసులు సైతం వికలాంగుడైన పొన్నయ్యను తీసుకొని స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా సమీప శాఖలో బ్యాంకులో ఆర్ధికపరమైన వ్యవహారాల్లో సహకరించారు. పొన్నయ్య ఇప్పటివరకు వేల్లరద వద్ద ఉన్నాడు. ఇక త్వరలో తన తండ్రి మరియు సోదరుడితో సహా ఇంటికి తిరిగి వెళ్ళిపోనున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







