360 మాల్ వద్ద కువైట్ మోటర్ షో 2020 ప్రారంభం
- March 25, 2022
కువైట్: పదవ ఎడిషన్ కువైట్ మోటర్ షో 2022 బుధవారం 360 మాల్ వద్ద ప్రారంభమైంది. కువైట్ మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ మరియు మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ మరియు రెన్యువబుల్ ఎనర్జీ అలి అల్ మౌసా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీల ప్రతినిథులు, వివిధ దేశాలకు చెందిన రాయబారులు, కార్ల పట్ల ఆసక్తి వున్నవారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆగస్ట్ 1 వరకు ఈ షో కొనసాగుతుంది. వివిధ రకాలైన బ్రాండ్లకు చెందిన అత్యాధునిక కార్లు ఇక్కడ అందుబాటులో వుంటాయి. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో రెండేళ్ళపాటు ఈ షో నిర్వహించలేకపోయారు. 150కి పైగా కార్లు, మోటర్ బైక్‌లు ఈ షోలో ప్రదర్శనకు వుంచుతారు. అమెరికా, యూరోప్, జపాన్, చైనా మరియు కొరియా తదితర దేశాలకు చెందిన కార్ల సంస్థలు ఇక్కడ తమ ఉత్పత్తుల్ని ప్రదర్శనకు వుంచాయి.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







