బిజీ అయిన యంగ్ హీరో శేష్
- April 02, 2016
కర్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో అడవి శేష్, ఆ సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తరువాత హీరో అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్న ఈ యువ నటుడు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. నటుడిగానే కాక రచయితగా, దర్శకుడిగా కూడా అనుభవం ఉన్న ఈ ఎన్నారై కుర్రాడు తాజా విజయంతో హీరోగా బిజీ అవుతున్నాడు.లాంగ్ గ్యాప్ తరువాత అడవి శేష్, తానే కథ అందించి హీరోగా నటించిన సినిమా క్షణం. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇప్పుడు వరుస అవకాశాలలతో బిజీ అవుతున్నాడు. డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి ఇటీవలే నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టిన అభిషేక్ పిక్చర్స్, అడవి శేష్ హీరోగా రెండు సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతుంది.
ఈ రెండు సినిమాలను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు శేష్.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







