ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు...
- March 26, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు ఆయన కేబినెట్ సహచరులకు ఇదివరకే సంకేతాలు కూడా ఇచ్చారు.పదవి నుంచి తప్పించిన మంత్రులు పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. పదవి నుంచి తప్పించిన వారికి జిల్లా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించనున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు.అయితే త్వరలో జరిగే ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైనట్టుగా వార్తలు వెలువడుతున్నాయి.ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారని ప్రచారం జరుగుతుతోంది.
మంత్రివర్గంలో చేయబోయే మార్పుల గురించి సీఎం జగన్ ఓ క్లారిటీకి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరెవరరూ బెర్త్‌లు కోల్పోనున్నారు..? కొత్తగా అవకాశం దక్కించుకునేవారు ఎవరనేదానిపై వైసీపీ సర్కిల్స్‌లో తెగ చర్చ సాగుతుంది.మంత్రివర్గంలో నుంచి ఉద్వాసన తప్పదేమోనని చాలా మంది మంత్రులు టెన్షన్ పడుతున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు చాలా కాలంగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు మాత్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఇక, గత కొంతకాలంగా సీఎం జగన్ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన సీఎం జగన్.. అప్పుడు ఏర్పాటు చేసిన మంత్రివర్గం రెండున్నర ఏళ్లు మాత్రమే ఉంటుందని చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి కేబినెట్లో చోటు కల్పిస్తానని అన్నారు. దాదాపు 90 శాతం మంది మంత్రులను మార్చి.. తొలి విడుతలో అవకాశం దక్కనివారికి అవకాశం కల్పిస్తానని సీఎం జగన్ చెప్పారు. ఇప్పుడే ఆ దిశలోనే మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!







