జియో ఐపీఎల్ సరికొత్త ప్లాన్లు..
- March 26, 2022
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఐపీఎల్ క్రికెట్ అభిమానుల కోసం ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా జియో T20 ధనా ధనా ధన్ రెండు సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో యూజర్లు ఐపీఎల్ 2022 టోర్నమెంట్‌ను ఉచితంగా చూసేందుకు వీలుగా రెండు కొత్త మొబిలిటీ ప్లాన్‌లను ప్రారంభించింది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్‌స్టార్ భాగస్వామ్యంతో రూ. 555 రూ. 2999 ధరలతో సరసమైన ధరకే ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియో T20 ధన్ ధనా ధన్ ఆఫర్ కింద ఈ ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు సరికొత్త ప్లాన్లు, రివార్డ్‌లు అఫర్ చేస్తోంది.
ఈ రెండు ప్లాన్లను యాక్టివేట్ చేసుకుంటే చాలు.. ఎలాంటి అదనపు రీఛార్జ్ చేయకుండానే Disney+ Hotstar సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. ఈ కొత్త రూ. 555 రూ. 2999 ప్లాన్‌లు జియో ప్రస్తుత క్రికెట్ ప్లాన్‌ల జాబితాకు యాడ్ ఆన్ ప్లాన్లుగా అందిస్తోంది. ఇప్పటివరకూ జియో అందించే క్రికెట్ ప్లాన్ల జాబితాలోని చౌకైన ప్లాన్ ధర రూ. 499 నుంచి రూ. 3119 వరకు అందిస్తోంది. అయితే ఈ కొత్త రూ. 555, రూ. 2999 ప్లాన్‌లను గత 28 రోజులుగా ఏదైనా జియో యాక్టివ్ ప్లాన్‌లో కొనసాగుతున్న యూజర్లు మాత్రమే పొందే అవకాశం ఉంది. జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు ఈ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. రూ. 555 జియో ప్లాన్ ప్రాథమికంగా డేటా-ఆన్ ప్లాన్ అందిస్తోంది. అంటే.. మీ ప్రస్తుత ప్లాన్‌పై అదనపు డేటాను అందిస్తుంది. ఈ యాడ్ ఆన్ ప్లాన్లపై వాయిస్ కాలింగ్ లేదా SMS బెనిఫిట్స్ పొందలేరు. జియో ఈ ప్లాన్లను ప్రధానంగా జియో ఐపీఎల్ క్రికెట్ వీక్షించే యూజర్ల కోసం ప్రవేశపెట్టింది. ఈ యాడ్ ఆన్ ప్లాన్లను పొందాలంటే ముందుగా మీరు ఇదివరకే ఏదైనా క్రికెట్ ప్లాన్ లో ఉండాలి. అప్పుడే ఈ యాడ్ ఆన్ ప్లాన్లను యాక్టివేట్ చేసుకోవచ్చు.
కొత్త మొబిలిటీ ప్లాన్ ఆఫర్‌ల విషయానికి వస్తే.. మీరు జియో యాప్‌లు డిస్నీప్లస్ హాట్‌స్టార్‌ను 12 నెలల పాటు సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. రూ.555 జియో ప్లాన్ కింద.. 55 రోజుల పాటు రోజుకు 1GB డేటాను కూడా పొందవచ్చు.మీ రోజువారీ డేటా లిమిట్ దాటిన తర్వాత మీ డేటా డౌన్‌లోడ్ స్పీడ్ 64Kbsకి తగ్గిపోతుంది.ఈ ప్లాన్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మొబైల్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. టీవీ లేదా ల్యాప్‌టాప్ డివైజ్ లపై వర్తించదు. జియో రూ.2999 ప్లాన్ కూడా లిమిటెడ్ పీరియడ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదో వార్షిక ప్లాన్. ఈ ప్లాన్ కింద రోజుకు 2.5GB డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. రోజుకు 100 SMSలు,జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







