చారిత్రాత్మకమైన UAE-India CEPA వివరాలు వెల్లడి

- March 28, 2022 , by Maagulf
చారిత్రాత్మకమైన UAE-India CEPA వివరాలు వెల్లడి

న్యూ ఢిల్లీ: భారత్‌, యూఏఈ మధ్య గత నెలలో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)లో భాగంగా పెట్టుబడులు, వాణిజ్య ప్రోత్సాహం, సులభతరానికి సంబంధించి సాంకేతిక మండలిని ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు ఆదివారం అంగీకరించాయి.ఐదేళ్ల కాలంలో ద్వైపాక్షిక వాణి జ్యాన్ని 10,000 కోట్ల డాలర్లకు పెంచడంతోపాటు లక్షలాదిగా ఉద్యోగాలను కల్పించడానికి వీలుగా భారత్‌, యూఏఈలు సీఈపీఏపై ఫిబ్రవరిలో సంతకాలు చేశాయి.కాగా పెట్టుబడులు, వాణిజ్య సహకారాన్ని ప్రోత్సహించడంతోపాటు పెట్టుబడి, వాణిజ్య సంబంధాలను పర్యవేక్షించడం,పెట్టుబడి, వాణి జ్యాన్ని విస్తరించడానికున్న అవకాశాలను గుర్తించడం వంటివి మండలి లక్ష్యాలుగా ఉన్నాయి. భారత్‌కు యూఏఈ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2020-21 సంవత్సరంలో భారత్‌, యూఏఈ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 4,330 కోట్ల డాలర్లుగా ఉంది.

2019-20లో ఇది 5,911 కోట్ల డాలర్లుగా నమోదైంది.ఇదిలా ఉంటే.. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కారణంగా భారతీయ వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు లభించనున్నాయి. నర్సులు, ఇంజనీరింగ్‌, అకౌంటింగ్‌ వృత్తినిపుణులతోపాటు ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులను యూఏఈ సులభంగా అనుమతించనుంది.ఇక ఒప్పందం మేరకు 160 సర్వీసులకు గాను 100 సర్వీసులను సులభతరం చేయడానికి భారత్‌ కట్టుబడి ఉందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి దాకా దృష్టంతా తయారీ పైనే ఉండేది.ఇప్పుడు సర్వీసులపై కూడా ఉండనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com