స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- January 16, 2026
దోహా: స్టీవ్ హార్వే రూపొందించి, సమర్పించిన ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ స్టేడియం 974లో జరిగిన 15వ ఖతార్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ (QIFF)కు తనదైన ప్రత్యేకమైన ఉత్సాహభరితమైన శక్తిని తీసుకువచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రెండు రోజుల కార్యక్రమం ప్రఖ్యాత ఓపెన్ ఫైర్ చెఫ్‌లు మెలిస్సా కుక్స్టన్, మో కాసన్ మరియు బాబ్ ట్రుడ్నాక్లతో పాటు హార్వే పాల్గొన్న ఒక ఉత్సాహభరితమైన ప్యానెల్ చర్చతో ప్రారంభమైంది. వక్తలు గ్రిల్లింగ్, సాంస్కృతిక సంబంధాలు మరియు వారి వ్యక్తిగత కలినరీ ప్రయాణాలపై తమ అభిప్రాయాలను పంచుకోవడంతో ఈ ప్యానెట్ చర్చ ప్రేక్షకులతో కేరింతలు కొట్టించింది.
ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభ రోజు, అద్భుతమైన ఫైర్ వర్క్స్ మరియు డ్రోన్ ప్రదర్శన ఈ భారీ కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చింది. ఈ ఉత్సవం జనవరి 24వరకు కొనసాగుతుంది. ఈ ఉత్సవానికి ప్రవేశం ఉచితం. వారాంతపు రోజులలో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు, వారాంతాల్లో సాయంత్రం 3 గంటల నుండి తెల్లవారుజామున 1 గంట వరకు తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







