సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- January 16, 2026
సౌదీ అరేబియా: ప్రపంచవ్యాప్తంగా చమురు సంపదకు పెట్టింది పేరు సౌదీ అరేబియా. అయితే ఇప్పుడు ఆ దేశం మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. సౌదీ అరేబియాలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో కళ్లు చెదిరే స్థాయిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సుమారు 78 లక్షల ఔన్సుల పసిడి నిక్షేపాలు కొత్తగా కనుగొన్నట్లు ఆ దేశ ప్రభుత్వ మైనింగ్ సంస్థ ‘మాడెన్’ వెల్లడించింది. ఎక్కడెక్కడ ఈ బంగారు నిధులు ఉన్నాయి? మాడెన్ సంస్థ చేపట్టిన విస్తృతమైన డ్రిల్లింగ్, అన్వేషణలో ఈ భారీ నిధులు వెలుగు చూశాయి. ముఖ్యంగా నాలుగు ప్రాంతాల్లో ఈ బంగారం ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది.. ఇక్కడే అత్యధికంగా 30 లక్షల ఔన్సుల అదనపు నిక్షేపాలు బయటపడ్డాయి.
ఈ కొత్త ప్రాంతంలో సుమారు 38 లక్షల ఔన్సుల బంగారం ఉండవచ్చని అంచనా. ఉరుక్, ఉమ్ అస్ సలాం: ఈ రెండు ప్రాంతాల నుంచి కలిపి మరో 16.7 లక్షల ఔన్సుల పసిడి లభించింది. ఈ ఆవిష్కరణలతో సౌదీ అరేబియాలోని అరేబియన్ షీల్డ్ ప్రాంతంలో ఇంకా అపారమైన ఖనిజ సంపద దాగి ఉందని స్పష్టమవుతోంది. బంగారమే కాదు.. రాగి, నికెల్ కూడా! సౌదీ అరేబియా కేవలం బంగారు నిధుల తోనే ఆగడం లేదు. జబల్ షైబాన్, జబల్ అల్ వకీల్ వంటి ప్రాంతాల్లో జరిపిన డ్రిల్లింగ్‌లో భారీగా రాగి, నికెల్, ప్లాటినం వంటి విలువైన లోహాలు కూడా ఉన్నట్లు గుర్తించారు.
దీనివల్ల సౌదీ అరేబియా కేవలం చమురుపైనే కాకుండా, మైనింగ్ రంగం ద్వారా కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి చేరుకోనుంది. ఈ తాజా ఆవిష్కరణలు ఆ దేశ ఆదాయాన్ని భారీగా పెంచడమే కాకుండా ప్రపంచ పసిడి మార్కెట్‌లో సౌదీ అరేబియా పాత్రను మరింత కీలకం చేయనున్నాయి. మాడెన్ సీఈఓ బాబ్ విల్ట్ మాట్లాడుతూ.. “ఈ ఫలితాలు మా దీర్ఘకాలిక వ్యూహానికి నిదర్శనం. సౌదీలో మరిన్ని బంగారు నిక్షేపాలను వెలికితీయడానికి మేము భారీగా పెట్టుబడులు పెడుతూనే ఉంటాం” అని ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా సౌదీలో అతి పెద్ద బంగారు గనులు దొరకడం హాట్ టాపిక్ గా మారింది.
తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







