'తెరి' చిత్రానికి తెలుగులో 'పోలీసోడు' టైటిల్ ..
- April 03, 2016
విజయ్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న 'తెరి' చిత్రానికి తెలుగులో 'పోలీసోడు' టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సమంత, అమీజాక్సన్ నాయికలు. 'దిల్' రాజు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా 'దిల్' రాజు మాట్లాడుతూ ''రాజారాణి సూపర్‌హిట్ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో అత్యున్నత సాంకేతిక విలువలతో వస్తున్న చిత్రమిది. కథానుగుణంగా 'పోలీసోడు' టైటిల్ కరెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో పాటల్ని విడుదల చేసి, ఈ నెల మూడోవారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం'' అని అన్నారు.ప్రభు, రాధిక, మహేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జాన్.సి.విలియమ్స్, సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!









