రమదాన్.. టాక్సీ ఓనర్లకు 12.8 మిలియన్ దిర్హామ్‌ల బోనస్
- April 03, 2022
యూఏఈ: దుబాయ్‌లోని టాక్సీ నంబర్ ప్లేట్ ఓనర్లకు మొత్తం Dh12,825,000 బోనస్‌గా చెల్లించనున్నారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ద్వారా టాక్సీ నంబర్ ప్లేట్‌లను ఉపయోగించే పౌరులకు బోనస్‌ను అందించాలని దుబాయ్ పాలకుడు హోదాలో, యుఎఇ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) పవిత్ర రమదాన్ మాసంలో 2,565 టాక్సీ నంబర్ ప్లేట్ల యజమానులకు బోనస్‌లను పంపిణీ చేయనున్నారు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తీసుకున్న ఉదారమైన నిర్ణయానికి RTA డైరెక్టర్ జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఛైర్మన్ మత్తర్ మొహమ్మద్ అల్ టేయర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ బోనస్ పౌరుల సంక్షేమాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు మరింత సంతోషంగా రమదాన్ ను జరుపుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అల్ టేయర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







