నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’.. ఆగస్ట్ 5న గ్రాండ్ రిలీజ్
- April 04, 2022
హైదరాబాద్: కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఈ టైటిల్ పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది. శనివారం తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బింబిసార చిత్రాన్ని ఆగస్ట్ 5న విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి.
‘బింబిసారలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కీలకంగా ఉండబోతున్నాయి. భారీ సెట్స్‌తో కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నికల్ వేల్యూస్ మూవీ ఇది. ఆగస్ట్ 5న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ తెలియజేసింది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ మ్యూజిక్. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: సిరి వెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, డాన్స్: శోభి, రఘు, ఫైట్స్: వెంకట్, రామకృష్ణ, వి.ఎఫ్.ఎక్స్: అనిల్ పడూరి, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె, ఎడిటర్: తమ్మిరాజు, మ్యూజిక్: చిరంతన్ భట్, నేపథ్య సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు, ప్రొడ్యూసర్: హరికృష్ణ.కె, దర్శకత్వం: వశిష్ఠ్.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్‌లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్‌లో మంత్రి సత్యకుమార్‌తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









