రమదాన్.. డే టైంలో ఫుడ్ కు రెస్టారెంట్‌లకు అనుమతి
- April 04, 2022
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాస సమయాల్లో ఆహారం అందించడానికి దుబాయ్‌లోని రెస్టారెంట్‌లకు ముందస్తు అనుమతి అవసరం లేదు. ఈ మేరకు దుబాయ్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (డీఈటీ) సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఫుడ్ కోర్టులలో ఉన్న రెస్టారెంట్‌లు, కేఫ్‌లు తమ వ్యాపారాన్ని యథావిధిగా నిర్వహించాలని, పగటిపూట ఆహారాన్ని అందించడానికి స్క్రీన్‌లు లేదా కర్టెన్‌లను ఉంచాల్సిన అవసరం లేదని సర్క్యూలర్ లో పేర్కొన్నారు. ఎమిరేట్‌లోని రెస్టారెంట్‌లు గత సంవత్సరం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపవాస సమయాల్లో ఆహారాన్ని అందించడానికి కర్టెన్‌లను ఉంచాలా లేదా అని నిర్ణయించుకోవచ్చని సర్క్యులర్ పేర్కొంది. గత సంవత్సరం, దుబాయ్‌లోని రెస్టారెంట్లు రమదాన్ లో పగటిపూట కర్టెన్లు, డివైడర్‌లు లేదా ముందుభాగాలు కనబడకుండా కస్టమర్‌లకు సర్వీసులు అందించేందుకు అనుమతించారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







