ప్యాసింజర్ విమానాలను ఇంధన సరఫరా విమానాలుగా మార్చనున్న భారత్
- April 07, 2022
            న్యూ ఢిల్లీ: భారత వాయుసేన అవసరాల నిమిత్తం జెట్ విమానాలకు గగనతల ప్రయాణ మధ్యలో ఇంధనం నింపేందుకుగానూ అవసరమైన ఇంధన విమానాలను సేకరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇంధన విమానాల సేకరణ కోసం గత కొన్నేళ్లుగా ఎన్నో వ్యయప్రయాసలు కూర్చిన కేంద్ర ప్రభుత్వం..ఇపుడు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇప్పటికే వాడుకలో ఉన్న బోయింగ్ 767 ప్యాసింజర్ విమానాలకు కొద్దీ పాటి మార్పులు చేసి గగనతల ఇంధన వాహకాలుగా వినియోగించేలా భారత ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈక్రమంలో దేశీయ విమానతయారీ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ప్యాసింజర్ విమానాలను ఇంధన వాహకాలుగా మార్చే పరిజ్ఞానం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(IAI)కే ఉంది.
ప్యాసింజర్ విమానాలను ఆయిల్ ట్యాంకర్లుగా, కార్గో విమానాలుగా మార్చడంలో ప్రత్యేకత చాటుకుంది IAI. మల్టీ – మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ (MMTT) ఎయిర్‌క్రాఫ్ట్‌గా పిలిచే ఈతరహా విమానాలను ఇజ్రాయెల్ సంస్థతో కలిసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) రూపొందించనుంది. ఈమేరకు ఇజ్రాయెల్ సంస్థతో ఒప్పందం ఖరారు చేసుకున్నట్లు HAL ప్రతినిధి ఒకరు బుధవారం మీడియాకు వెల్లడించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహా భారత సైన్యంలో సేవలు అందిస్తున్న ఫైటర్ జెట్ విమానాలకు గగనతలం నుంచి గగనతలంలోనే ఇంధనం నింపేందుకు ఇప్పటివరకు ఆరు ఇంధన రవాణా విమానాలు అందుబాటులో ఉన్నాయి.
2003లో రష్యా సహకారంతో తీసుకొచ్చిన ఆ విమానాలు తరచూ కాలాంతర మరమ్మతులుకు గురవుతున్నాయి. ఇక ప్రస్తుత తరుణంలో గగనతల ఇంధన వాహకాల అవసరం తప్పనిసరైన క్రమంలో ప్రభుత్వం మరో 6 ట్యాంకర్ విమానాలను సేకరించాలని నిర్ణయించింది. సాంప్రదాయ ఇంధన ట్యాంకర్ విమానాల ధరలతో పోల్చితే..ప్యాసింజర్ విమానాలను ఇంధన వాహకాలుగా మార్చడం ఖర్చు తక్కువతో కూడుకున్నది. దీంతో బోయింగ్ సంస్థ తమ విమానాల్లో వినియోగించే “KC-46 పెగాసస్” ట్యాంకర్ కు మార్పులు చేర్పులు చేస్తూ ఇంధన వాహక విమానంగా వాడనున్నారు. ఇక సరికొత్త గగనతల ఇంధన వాహకాలు అందుబాటులోకి వస్తే..భారత వాయుసేనలోని ఫైటర్ జెట్స్..నేలపై దిగకుండానే సుదీర్ఘ సమయంపాటు గగనతలంలో ఉంటూ సేవలు కొనసాగించవచ్చు.
తాజా వార్తలు
- లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







