ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన మెడికవర్ హాస్పిటల్స్ టీం
- April 07, 2022
హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ వారిచే మొక్కలు నాటటం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెడికవర్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి ,న్యూరో & స్పైన్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి,గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక, డాక్టర్ మీనాక్షి మరియు పిడియాట్రిషన్ & నినాటోలోజిస్ట్ డాక్టర్ నవిత మరియు ఇతర వైద్య సిబ్బంది సుమారుగా 100 మంది పాల్గొన్నారు.అందరూ కలిసి సుమారుగా 300 మొక్కలను నాటటం జరిగింది.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యంపై అవగాహన కల్పించటానికి ఈ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఈ సంవత్సరం OUR PLANET - OUR HEALTH అనే నినాదంతో ఈ యొక్క ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.మన రాబోయే తరాలకు అందమైన జీవితాన్ని గడపడానికి ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన వాతావరణాన్ని ఇద్దాం, ప్రకృతిని పరిరక్షించాల్సిన అవసరం మరియు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత గురించి ప్రపంచ ప్రజలలో అవగాహన కలిగించే ఏకైక ఉద్దేశ్యంతో మేము ఈ మొక్కల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.మన పరిసరాలు పచ్చగా ఉంటె స్వచ్ఛమైన గాలిని పీల్చడం, తద్వారా ఆరోగ్యం బాగుంటుంది.ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని తెలియజేసే దిశగా ఈ రోజును మనం జరుపుకుంటున్నాం.ఆరోగ్యంగా వుండేందుకు వ్యాయామాలు చేస్తూ.. పౌష్టికాహారం తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ సందర్భంగా ఎన్యూరో & స్పైన్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్‌పై వున్న భయంతో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఇంకా కరోనా నియమాలను పాటిస్తున్నారు.అయినప్పటికీ ప్రపంచ దేశ ప్రజలను కోవిడ్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా వుండాలని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంటున్నారు.ప్రజలు వివిధ రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో ఆరోగ్యకరమైన అంశాలపై సమన్వయం, వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించాలని, మన ఆరోగ్యం మన బాధ్యత. మన ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఎవరో వచ్చి, ఏదో చేయరు. మన ఆరోగ్యాన్నికాపాడుకోవాల్సింది మనమే..అందుకు శ్రద్ధ తీసుకోవాల్సిందీ మనమే అని అన్నారు.
డాక్టర్ రాధిక మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో అన్నింటికన్నా ముఖ్యమైంది, కీలకమైంది మన జీవనశైలి.మనం ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం, బరువు అదుపు, క్రమం తప్పని వ్యాయామం, మానసిక ప్రశాంతత ఇవి చాలు. వ్యాయామం కూడా పెద్ద పెద్ద లక్ష్యాలే అవసరం లేదు. చిన్న చిన్న మార్పులైనా చాలు. నెమ్మదిగా ఆరంభించినా చాలు. మంచి ప్రయోజనం కల్పిస్తుంది. క్రమంగా ఒక అలవాటుగా మారి, చక్కటి ఆరోగ్య జీవితానికి మార్గం సుగమం చేస్తుంది. సమానమైన, మెరుగైన ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించాలని ప్రతి ఒక్కరు పాటించాలి.
ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాకేష్ మరియు సెంటర్ హెడ్ మాత ప్రసాద్, అనిల్ పాల్గొన్నారు.



తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







