హల్ చల్ చేస్తున్న మంచు విష్ణు, సన్నీలియోన్ సరదా రీల్!
- April 08, 2022
హైదరాబాద్: మంచు విష్ణు 'గాలి నాగేశ్వరరావు' గా లీడ్ రోల్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రేణుక గా నటిస్తోంది ఇంటర్నేషనల్ సెన్సెషన్ సన్నీలియోన్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్న విష్ణు, సన్నీ సరదాగా ఓ రీల్ చేసారు. ఈ రీల్ ని ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది సన్నీలియోన్. ఈ రీల్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది.
ఓ మాస్క్ పెట్టుకుని నడుస్తూ వస్తున్న విష్ణును బయపెట్టడానికి ట్రై చేసింది సన్నీలియోన్. బయపడినట్టూ నటిస్తూ, ఫన్ చేసాడు విష్ణు. బ్యాక్ గ్రౌండ్ లో ''చూపే బంగారమాయేనే శ్రీవల్లి..'' పాట పోస్ట్ చేసిన ఈ వీడియో చాలా సరదాగా ఉంది. ఈ వీడియోకి... ''అండ్ ఎగైన్ ఎపిక్ ఫెయిల్ ఫర్ మీ..'' అని విష్ణు కామెంట్ చేసాడు.
డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







