భారీగా తగ్గిన కొవీషీల్డ్ ధర..
- April 09, 2022
న్యూ ఢిల్లీ: కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ షాట్స్ అందుబాటులోకి రానుండటానికి ఒక రోజు ముందుగానే భారీగా ధర తగ్గిపోయింది. సగం కంటే తక్కువగా అంటే రూ.600 నుంచి రూ.225కి పడిపోయింది వ్యాక్సిన్ ధర. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్ పూనావాలా ధర తగ్గించినట్లు స్వయంగా వెల్లడించారు.
కేంద్రంతో జరిపిన పలు చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.“కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ అయిన కొవీషీల్డ్ ను ప్రైవేట్ హాస్పిటల్స్ కు రూ.600కు బదులుగా రూ.225కే అందిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. కేంద్రం నిర్దేశించినట్లుగా 18సంవత్సరాల పై బడిన వారంతా ప్రికాషనరీ డోసుగా కొవీషీల్డ్ ను తీసుకుంటారని ఆశిస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు.
గతంలో ఉన్న రూ.600 + ట్యాక్స్ ను సవరిస్తూ.. రూ.225 + ట్యాక్స్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నాయి. కొవీషీల్డ్, కొవాగ్జిన్ ధరలు భారీగా తగ్గడంతో ప్రజల నుంచి ఆదరణ ఎక్కువగా కనిపిస్తుందనే అంచనాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







