బహరేన్లో అనారోగ్యంతో భారత విద్యార్థి మృతి

- April 03, 2016 , by Maagulf
బహరేన్లో అనారోగ్యంతో భారత విద్యార్థి మృతి

 ఆదివారం భారత విద్యార్థి అమల రెజి (15 ) అనారోగ్యంతో మరణించిది .ఆమె ఇండియన్ స్కూల్ బారేన్ ( ఐ ఎస్ బి )లో 9వ తరగతి  చదువుతుండేది. ఆమె ఈస్ట్ రిఫ్ఫా లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాధమిక వైద్య చికిత్స పొందింది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె జబ్బుకు లోనవడంతో బి డి ఎఫ్  ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు  భారీ మెదడు మరియు ఊపిరితిత్తులలో రక్తస్రావంతో  బాధపడుతున్న కారణంగా  వెంటిలేటర్ ను ఏర్పాటుచేశారు. ఆమె మరణించె సమయంకు ఆమె 10 వ తరగతికి పదోన్నతి పొందారు  జార్జ్ మరియు జెస్సి జార్జ్ ల  కుమార్తె  అమలా రేజిమోన్ భారతదేశంలోని కేరళ రాష్ట్రం లోని  ఇడుక్కి జిల్లాలో కట్టప్పన ప్రాంతానికి చెందినవారు. అమలా అన్నయ్య  క్రిస్టీన్  ఇండియన్ స్కూల్ బారేన్ ( ఐ ఎస్ బి )లో  12  తరగతి చదువుతున్నాడు.కాగా, అమల రెజి తండ్రి జార్జ్ గత ఎనిమిది సంవత్సరాలుగా  బహరేన్ లో నివాసం ఉంటూ  మరియు అహ్మద్ మన్సూర్ అల్ ఆ'అలీ  కంపెనీ లో ఒక ఇంజనీర్ గా పని చేస్తున్నారు. వీరు ఆవలి సేక్రెడ్ హార్ట్ చర్చి సభ్యులు.మృతదేహం సల్మనియ  మెడికల్ కాంప్లెక్స్ ( ఎస్ ఎం సి) లోని  మృతదేహాలను భద్రపరిచే వద్ద  ఉంచబడిన ఉంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com