'ఎ పాసేజ్ టు ఇండియా' ఫెస్టివల్ ఏప్రిల్ 14 నుంచి
- April 03, 2016
దోహాలో ఏప్రిల్ 14 నుంచి రెండ్రోజులపాటు అంటే 14, 15 తేదీల్లో 'ఎ పాసేజ్ టు ఇండియా' ఫెస్టివల్ జరగనుంది. ఇండియన్ కల్చరల్ సెంటర్ (ఐసిసి) ఆధ్వర్యంలో జరుగనున్న ఈ ఫెస్టివల్‌కి స్ప్రాలింగ్ మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ (ఎమ్ఐఏ) గ్రౌండ్ వేదిక కానుంది. ఈ ఫెస్టివల్‌తోపాటు బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్ని కూడా నిర్వహిస్తారు. కల్చరల్ ప్రోగ్రామ్స్, హ్యాండిక్రాఫ్ట్స్ ప్రదర్శన, భారతీయ వంటకాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఉదయం 9 గంటలకు మంగళ్యాణ్కి సంబంధించి రిప్లికా ఉంటుంది. భారతదేశంలోని 'భిన్నత్వంలో ఏకత్వాన్ని' ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. రాజస్థాన్ నుంచి వచ్చిన కళాకారులు ఇచ్చే సాంస్కృతిక ప్రదర్శనలు మరో ఆకర్షణ అవుతాయి. మ్యూజిక్ మరియు ఫోక్ డాన్సులు ఆహూతుల్ని అలరించనున్నాయి. 2013లో నిర్వహించిన తొలి ఫెస్టివల్లో 25,000 మంది ఆహూతులు విచ్చేశారు. 2015లో సుమారు 60,000 మంది వచ్చారు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఆహూతులు వస్తారని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







