అల్లు శిరీష్ కొత్త చిత్రం మొదలయ్యింది
- June 11, 2015మెగా కుటుంబం నుంచి మరో హీరో అల్లు శిరీష్. అల్లు అరవింద్ కుమారుడు, అల్లు అర్జున్ సోదరుడు అయిన అల్లు శిరీష్ కు తొలి చిత్రం సమయంలో మంచి క్రేజే వచ్చింది. అయితే ఆ చిత్రం డిజాస్టర్ ఫ్లాఫ్ అవటం అతన్ని ఇబ్బంది పెట్టింది. ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు 'గౌరవం' సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో అల్లు శిరీష్. ఆ తర్వాత 'కొత్త జంట' సినిమాతో మెగా ఫ్యామిలీ హీరోల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 'కొత్త జంట' తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న శిరీష్, తాజాగా ఈరోజే మరో కొత్త సినిమాను మొదలుపెట్టేశారు. 'యువత', 'ఆంజనేయులు', 'సోలో' సినిమాలతో మెప్పించిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 'సారొచ్చారు' తర్వాత పరశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ఇదే కావటం విశేషం. రామ్ తో అనుకున్నా వర్కవుట్ కాకపోవటంతో ఇప్పుడు అల్లు శిరీష్ తో ముందుకు వెళ్తున్నారు. ఈ ఉదయం అల్లు శిరీష్ కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఓ మంచి లవ్‌స్టోరీతో పాటు, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని శిరీష్ ఈ సందర్భంగా తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







