ముబారకియా అగ్ని ప్రమాదం: దెబ్బతిన్న దుకాణాలకు కంపెనీ ఆఫర్
- April 11, 2022
కువైట్: కువైట్ రియల్ ఎస్టేట్ కంపెనీ, ముబారకియా అగ్ని ప్రమాదం కారణంగా దెబ్బతిన్న దుకాణాలకు సంబంధించి దుకాణదారులకు ఓ మంచి అవకాశాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది. తమ కంపెనీకి సంబంధించిన ప్రాంతాల్లో ఆయా వ్యాపారులు తమ ఉత్పత్తుల్ని ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచుకోవచ్చని వెల్లడించింది. కువైట్ రియల్ ఎస్టేట్ కంపెనీ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ బదర్ అల్ హజ్రి మాట్లాడుతూ, ఏడాది పాటు ఆయా వ్యాపారులకు మానవీయ కోణంలో తక్కువ ధరలకే తమ షాపుల్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆరు నెలల వరకు ఉచితంగా గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తారు. గత వారంలో సౌక్ ముబారకియా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో దుకాణాల యజమానులు తీవ్రంగా నష్టపోయారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







