ఏపీ: మంత్రులకు శాఖల కేటాయించిన సీఎం జగన్..
- April 11, 2022
అమరావతి: ఏపీలో కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది. కాసేపటి క్రితమే సందడిగా.. ప్రమాణ స్వీకారం పూర్తయింది. మొత్తంగా 25 మంది మంత్రులతో.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. వారితో ప్రమాణం చేయించారు. అనంతరం.. ముఖ్యమంత్రి జగన్.. మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియకు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. సామాజిక న్యాయం పాటిస్తూ.. ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వబోతున్నట్టుగా అమరావతి వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. కాపు వర్గం నుంచి కొట్టు సత్యనారాయణ, ఎస్సీల్లో నారాయణ స్వామి, బీసీల్లో ముత్యాల నాయుడు, మైనారిటీల నుంచి అంజాద్ బాషా, ఎస్టీల నుంచి రాజన్న దొర.. ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు.
ఇతర మంత్రుల విషయానికి వస్తే.. హోం మంత్రిగా తానేటి వనిత.. రెవెన్యూ మంత్రిగా ధర్మాన.. పశు సంవర్థక శాఖ మంత్రిగా సిదిరి అప్పలరాజు.. విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ.. ఐటీ మంత్రిగా గుడివాడ అమర్ నాథ్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ముత్యాలనాయుడు.. ఆర్ అండ్ బీ మంత్రిగా దాడిశెట్టి రాజా.. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా వేణుగోపాలకృష్ణ.. టూరిజం మంత్రిగా ఆర్కే రోజా.. దేవాదాయ శాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ.. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్.. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరు నాగార్జున.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విడదల రజనీ.. పురపాలక శాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్.. వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాని.. విద్యుత్ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డికి.. సీఎం జగన్ అవకాశం ఇచ్చారు.
ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణస్వామి.. ఆర్థిక శాఖను మరోసారి బుగ్గన.. కార్మిక శాఖను గుమ్మునూరి జయరాం.. మహిళాసంక్షేమ శాఖ మంత్రిగా ఉషశ్రీ చరణ్.. రవాణాశాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్.. ఇరిగేషన్ శాఖ మంత్రిగా అంబటి రాంబాబు..ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా రాజన్న దొర.. మైనారిటీ శాఖ మంత్రిగా అంజాద్ బాషాకు ముఖ్యమంత్రి జగన్ అవకాశం కల్పించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







