సముద్ర తీరాల్లో 7 కొత్త లైఫ్ గార్డ్ టవర్స్ ఏర్పాటు
- April 11, 2022
యూఏఈ: షార్జా సిటీ మునిసిపాలిటీ బీచ్ ప్రాంతాల్లో 7 కొత్త లైఫ్ గార్డ్ టవర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. సముద్ర తీరంలో ఆహ్లాకర వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు వచ్చే బీచ్ గోయర్స్ ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోయే పరిస్థితి వస్తే, వెంటనే వారిని గుర్తించి రక్షించేందుకు ఈ టవర్స్ ఎంతగానో ఉపయోగపడతాయని సిటీ అపియరెన్స్ మానటరింగ్ డిపార్టుమెంట్ హెడ్ జమాల్ అబ్దుల్లా అల్ మజామి చెప్పారు. నాలుగు టవర్లను మమ్జార్ బీచ్లోనూ, మూడు టవర్లను అల్ ఖాన్ బీచ్లోనూ ఏర్పాటు చేవామని అన్నారాయన. సోలార్ ఎనర్జీతో పని చేసే చిన్న ఎయిర్ కండిషన్డ్ రూమ్ వీటిల్లో వుంటుంది. ఎమిరేట్ వ్యాప్తంగా 21 వాచ్ టవర్స్ వున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







