గుజరాత్ పై హైదరాబాద్ విజయం...
- April 12, 2022
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి.ఈ సీజన్లో కొత్తగా అడుగు పెట్టి ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలుపొంది జోరుమీదున్న గుజరాత్ జట్టుకి హైదరాబాద్ షాక్ ఇచ్చింది. గుజరాత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ సీజన్ లో తొలి ఓటమిని చవి చూసింది గుజరాత్ టైటాన్స్. 163 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ 19.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 8 వికెట్ల తేడాతో గుజరాత్ పై గెలుపొందింది.
ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేసినా.. బ్యాటింగ్‌లో హైదరాబాద్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు 19.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
హైదరాబాద్ బ్యాటర్లలో కెప్టెన్ కేన్ విలియమ్ సన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 46 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 2 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడాడు. 32 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. నికోలస్ వూరన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లో 38 పరుగులు(నాటౌట్) చేశాడు. 2 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. మార్ క్రమ్ 8 బంతుల్లో 12 పరుగులు(నాటౌట్) చేశాడు. రాహుల్ త్రిపాఠి (17) రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. గుజరాత్ బౌలర్లలో హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్… భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ ను సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా నియంత్రించారు. ఫీల్డర్లు వరుసగా క్యాచ్ లు వదిలినప్పటికీ బౌలర్లు సరైన ప్రదేశాల్లో బంతులు సంధిస్తూ, గుజరాత్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.
గుజరాత్ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 42 బంతుల్లో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, నటరాజన్ 2, మార్కో జాన్సెన్ 1, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ తీశారు.
తాజా వార్తలు
- సూరత్‌లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు
- ఈ నెల జూన్ 24, 25 తేదీల్లో 11వ ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్పో
- రామోజీ ఫిల్మ్‌సిటీలో టీజీ20 లీగ్ వేలం షురూ
- వనపర్తిలో అంబులెన్స్ ప్రారంభం..నిరుపేదలకు ఉచిత ఆటోలు పంపిణీ చేసిన సోనుసూద్
- 100 రోజులు.. స్థిరత్వాన్ని కాపాడుకున్న గల్ఫ్ దేశాలు..!!
- ప్రపంచవ్యాప్తంగా హ్యుమటేరియన్ సేవల్లో కువైట్ ఛారిటీస్..!!
- యూఏఈ లాటరీ డ్రా..ఒక్కొక్కరు Dh50,000 గెలుచుకున్నముగ్గురు విజేతలు..!!
- ఆన్లైన్ పర్యాటక మోసాలపై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!









