ఉపాధి కోసం అరబ్ దేశం వెళ్లింది..కానీ అలా చేయడంతో చివరికి ఉరిశిక్షకు గురయ్యింది..
- April 13, 2022
యెమెన్: ఉపాధి కోసం, మంచి జీతం కోసం చాలామంది భారతీయులు ఫారిన్‌కు వెళ్లడం సహజమే. ఈ మధ్య ఇలాంటి వారి సంఖ్య మరింత పెరిగిపోయింది.అయితే అలా ఉపాధి కోసం యెమెన్ దేశం కు వెళ్లింది ఓ మహిళ.
కానీ తనకు ఓ ఊహించని సమస్య వచ్చింది.దానివల్ల అక్కడి కోర్టు తనకు ఉరిశిక్షను ఖరారు చేసింది.ఇదంతా ఓ సినిమా కథను తలపించేలా ఉంది.
కేరళకు చెందిన నిమిషా ప్రియా అనే మహిళ నర్సు వృత్తిలో ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం తను ఉపాధి కోసం అరబ్ దేశమైన యెమెన్‌కు వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి దగ్గర నర్సుగా పనిచేసింది. 2017లో ఆ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి రోజువారీగా తీసుకునే ఇంజెక్షన్లు, మాత్రలు ఓవర్‌డోస్ అవ్వడంతోనే మరణించాడని నిర్ధారణ అయ్యింది. దీంతో నిమిషా ప్రియా చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.
నిమిషా ప్రియా వల్లే ఆ వ్యక్తి చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడం మొదలుపెట్టారు.తమ తండ్రి దగ్గర నిమిషా ప్రియా పాస్‌పోర్ట్ ఉందని అందుకోసమే ఆయనను చంపేసిందని ఆ వ్యక్తి వారసులు తెలిపారు. అంతే కాకుండా తమ తండ్రితో తనకు పెళ్లి అయిపోయినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లను కూడా సృష్టించింది అని అన్నారు.అయితే పోలీసుల విచారణలో కూడా ఆధారాలన్నీ నిమిషా ప్రియాకు వ్యతిరేకంగా ఉన్నాయి.
ఆ వ్యక్తిని చంపిన కేసులో యెమెన్ కోర్టు నిమిషా ప్రియా నిందితురాలంటూ ఉరిశిక్ష విధించింది. ఇటీవల ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు నిమిషా ప్రియాకు క్షమాభిక్ష పెట్టడానికి ఒప్పుకున్నారు.కానీ బదులుగా కొంత మొత్తాన్ని ఇవ్వమని అడిగారు.నిమిషా ప్రియా కుటుంబానికి అంత స్థోమత లేకపోవడంతో ఈ కేసు ఢిల్లీ హైకోర్టుకు చేరింది.అయితే, దౌత్యపరమైన ఈ విషయంలో కలగజేసుకోబోమని హైకోర్టు ధ్రువీకరించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







