అంబేడ్కర్ విగ్రహ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కేటీఆర్...డిసెంబ‌ర్‌లోగా విగ్ర‌హావిష్కరణ

- April 13, 2022 , by Maagulf
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కేటీఆర్...డిసెంబ‌ర్‌లోగా విగ్ర‌హావిష్కరణ

యావత్ ప్రజానీకానికి స్ఫూర్తినింపేలా ఐమాక్స్ సమీపంలో 125అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు.

ప్రపంచంలోనే అతిపెద్దదిగా హుస్సేన్ సాగర్ తీరాన సచివాలయం సమీపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నాం. పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 55 అడుగుల స్థలంలో దాదాపు పనులు చివరి దశకు చేరుకున్నాయి. విగ్రహ ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి.

“డిసెంబర్ నెలాఖరుకు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. అద్భుతమైన స్ఫూర్తి కేంద్రంగా మార్చుతాం. అంబేడ్కర్ చూపిన బాటలో నడుస్తున్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాం”

“రాష్ట్ర అభివృద్ధికి ఎవరు విఘాతం కలిగిస్తే సహించేది లేదు. ధాన్యం విషయంలో సీఎం కేసీఆర్ ఢిల్లీలో రైతులకు మద్దతుగా ధర్నా చేశారు. 11ఎకరాల ప్రాంగణంలో మ్యూజియం, పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నాం. రూ.150 కోట్లతో విగ్రహ, ప్రాంగణ నిర్మాణం అద్బుతంగా అత్యంత వేగంగా కొనసాగుతుంది”

“జీవితంలో ఒక్కసారే ఏర్పాటు చేసే బృహత్కార్యం ఇది. రాష్ట్ర ప్రజలు గర్వించే విధంగా సీఎం కేసీఆర్ సంకల్పం, ఆలోచనను అమలు చేస్తాం. అంబేద్కర్ ఆలోచల్లో నడుస్తూ.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు” కేటీఆర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com