చిరు 150వ సినిమా టైటిల్స్ పరిశీలన

- April 04, 2016 , by Maagulf
చిరు 150వ సినిమా టైటిల్స్ పరిశీలన

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ తన 150వ చిత్రం. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్టింగ్ పనులను చిత్ర యూనిట్ శరవేగంగా పూర్తి చేస్తుంది. అలాగే లొకేషన్స్ ని సైతం సెలక్షన్స్ చేసే పనిలో ఉంది. మెగాస్టార్ చిరంజీవి మూవీని స్టార్ట్ చేసిన దగ్గర నుండి, తక్కువ రోజుల్లోనే ఈ మూవీని పూర్తి చేసే విధంగా డైరెక్టర్ వినాయక్ షెడ్యూల్స్ ని రెడీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తమిళంలో విజయం సాధించిన కత్తి సినిమాకు రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు కొన్ని ఆసక్తికరమైన టైటిల్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన విరాల్లోకి వెళితే, చిరు 150వ సినిమాకు పోరాటం, న్యాయం, 'కత్తిలాంటోడు' వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.ఈ టైటిల్స్ ని ఇప్పటికే చిత్రయూనిట్ మెగాస్టార్ ముందు ఉంచాయి. అయితే వీటితో పాటు మరికొన్ని టైటిల్స్ ని సైతం రెడీ చేయాలని చిరు చెప్పుకొచ్చుడంట. రెండు మూడు రోజుల్లో తన 150వ సినిమాకి సంబంధించిన టైటిల్స్ ని చిరు ఫైనల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది. మొత్తంగా, మెగాస్టార్ 150వ సినిమాపై రోజుకోరకంగా అంచనాలను పెంచుకుంటూ వెళుతున్నారు. వినాయక్ ఇప్పటికే కత్తి తెలుగు రిమేక్ కి సంబంధించిన స్క్రిప్ట్ ని, మెగాస్టార్ అంచనాలన్నీ అందుకునే స్థాయిలోనే రెడీ చేశాడు. తెలుగు ప్రేక్షకులకి తగ్గట్టుగా కథలో కొద్దిపాటి మార్పులను చేసుకొచ్చాడని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com