ఐదు భాషల్లో 'ల్యాండ్‌మార్క్స్ ఫ్రమ్ ది టూ హోలీ మాస్క్స్' పుస్తకం

- April 14, 2022 , by Maagulf
ఐదు భాషల్లో \'ల్యాండ్‌మార్క్స్ ఫ్రమ్ ది టూ హోలీ మాస్క్స్\' పుస్తకం

సౌదీ: మక్కాలోని రెండు పవిత్ర మస్జీదుల విశేషాలను తెలిపే "ల్యాండ్‌మార్క్స్ ఫ్రమ్ ది టూ హోలీ మాస్క్స్" పుస్తకాన్ని రెండు పవిత్ర మసీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ ప్రెసిడెంట్ షేక్ డాక్టర్ అబ్దుల్‌రహ్మాన్ అల్-సుదైస్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఐదు భాషల్లోకి అనువదించారు. ఉర్దూ, పర్షియన్, మలావి, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్లో ఈ పుస్తకం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో పవిత్ర కాబా, బ్లాక్ స్టోన్, యెమెన్ కార్నర్ (అల్-రుక్న్ అల్-యమాని), పవిత్ర కాబా కీ, తాళం, దాని వస్త్రం, మిజాబ్ (వాటర్ స్పౌట్), హతీమ్ (పవిత్ర కాబా యొక్క దిగువ గోడ) సమాచారం ఉంది. మకామ్ ఇబ్రహీం, అల్-షతర్వాన్, అల్-సఫా వా అల్-మర్వా, ప్రదక్షిణ (తవాఫ్) ప్రాంతం, జంజామ్ బావి, గ్రాండ్ మస్జీదు ద్వారాలు, మస్జీదును విస్తరించే, నిర్మించే దశల వివరాలు ఉన్నాయి. సందర్శకులు, అతిథులకు అన్ని భాషలలో రెండు పవిత్ర మస్జీదుల వివరాలను అందించడానికి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినట్లు షేక్ అల్-సుడైస్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com