కోవిడ్ ప్రయాణ నిబంధనలను సడలించిన యూఏఈ
- April 14, 2022
యూఏఈ: రోజువారీ కేసులు బాగా తగ్గిపోతున్నందున ప్రయాణ సంబంధిత కోవిడ్ భద్రతా నియమాలను యూఏఈ సడలించింది. టీకాలు వేయని ఎమిరాటీస్‌పై ప్రయాణ నిషేధం ఎత్తివేశారు. ఏప్రిల్ 16 నుండి టీకాలు వేయని పౌరులు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. అయితే వారు విమానంలో ప్రయాణానికి 48 గంటలలోపు PCR పరీక్ష చేయించుకోవాలి. దీంతోపాటు గ్రీన్ స్టేటస్ పొందడానికి అల్ హోస్న్ యాప్‌లో ప్రయాణ ఫారమ్‌లను కూడా పూర్తి చేయాలి. గతంలో ఎమిరాటీలు విదేశాలకు వెళ్లాలంటే టీకాలు, బూస్టర్ డోస్‌లు తప్పనిసరి. కొత్త ప్రోటోకాల్‌ల ప్రకారం.. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కోవిడ్-19 టీకాలు తీసుకోకపోయినా విదేశాలకు వెళ్లడానికి PCR పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఈ మినహాయింపు 12 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఉండేది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







