APNRTS మరియు తెలుగు కళా సమితి ఖతార్ కృషితో స్వస్థలం చేరిన తల్లి కొడుకు
- April 15, 2022
దోహా: తెలుగు కళాసమితి ప్రెసిడెంట్ తాతాజీ ఉసిరికల తెలిపిన వివరాల ప్రకారం 2022 జనవరి నెలలో వెస్ట్ గోదావరి.జిల్లా పోడూరు కి చెందిన బొక్క లోకేష్, ఉద్యోగం చూసుకునేందుకు తల్లి బొక్క వెంకట లక్ష్మీ ద్వారా ఖతార్ కు బిజినెస్ వీజిట్ విసా మీద వెళ్ళటం జరిగింది.
అయితే నెల తరువాత బొక్క లోకేష్ అస్వస్థతకు గురి కావడంతో తల్లి బొక్క వెంకట లక్ష్మీ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేపించగ కొడుకు లోకేష్ కు రెండు కిడ్ని లు ఇన్ఫెక్షన్ అయినట్టు వైద్య పరీక్షలలో తేలింది.ప్రైవేట్ హాస్పిటల్ లో ఖర్చులు భరించలేక గవర్నమెంట్ హాస్పిటల్ హమద్ హాస్పిటల్ లో సంప్రదించటం జరిగింది.బొక్క లోకేష్ బిజినెస్ విజిట్ విసా మీద ఉన్న కారణంగా ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వటానికి నిరాకరించడం జరిగింది.తను హౌజ్ మెయిడ్ గా కష్టపడుతూ, పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బు తో డయాలిసిస్ చేపిస్తూ,తన కిడ్నీని కొడుకుకు ట్రాన్స్ ప్లాంట్ ఇవ్వటానికి సిద్ధపడింది ఆ మహిళ.అందు నిమిత్తం హాస్పిటల్ వారిని సంప్రదించగా వాళ్ళు ఇక్కడ కుదరదు అని చెప్పటం జరిగింది.ఎంత మందిని సంప్రదించిన ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఇండియా కు వెల్లటానికి నిర్ణయించుకొని విమాన టిక్కెట్లు తీసుకొని ఎయిర్పోర్ట్ కు చేరుకోగా..విసా గడువు ముగియడం కారణంతో.. ఇమ్మిగ్రేషన్ లో వారికి అధిక మొత్తం ఫైన్ వేయడం జరిగింది.ఫైన్ కడుతే గానీ ఇమ్మిగ్రేషన్ క్లియర్ చేయటం జరుగదు అని కచ్చితంగా అధికారులు చెప్పటం కూడా జరిగింది.
కట్టడానికి డబ్బులు లేక ఎటు తోచని పరిస్థితి లో ఉన్న వారి విషయం తెలిసిన తెలుగు కళా సమితి ప్రెసిడెంట్ తాతాజీ మరియు APNRT's కో-ఆర్డినేటర్ మనీష్ తగు సమయంలో వెంటనే స్పందించి, సీఐడీ అధికారులతో సంప్రదించి,లోకేష్ యొక్క ఆరోగ్య పరిస్థితి వివరించి, ఎటు వంటి ఫైన్ లేకుండా వారి ఇండియా ప్రయాణంకు అనుమతి ఇవాల్సిందని అధికారులను కోరగా, అధికారులు సానుకూలంగా స్పందించి ఫైన్ లేకుండా ఇండియా ప్రయాణంకు అనుమతించడం జరిగింది.తెలుగు కళా సమితి సభ్యులు అయిన రాజారమా పద్మజ ఉసిరికల మరియు కులశేఖర్ చిలుకలూరి బాధితులు ఇద్దరికీ విమాన టిక్కెట్లు స్పాన్సర్ చేయడం మరియు ఇతర ఖతార్ సంఘాల వారు ఇండియా లో ట్రీట్మెంట్ కొరకు కొంత ఆర్థిక సహాయం అందించడం కూడా జరిగింది.
బాధితుడు బొక్క లోకేష్ మరియు తల్లి బొక్క వెంకటలక్ష్మి 13 ఏప్రిల్ 2022 న సురక్షితముగా విజయవాడ చేరుకోవడం జరిగింది.బొక్క లోకేష్ మాట్లాడుతూ APNRTS & తెలుగు కళా సమితి సంఘాల ద్వారా మాలాంటి బాధితుల సమస్యలను పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి, APNRTS అధ్యక్షులకు, ఖతార్ లో సహాయం చేసిన మనీష్,తాతాజీ, కులశేఖర్, పద్మజ కి ధన్యవాదాలు తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







