కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలకు టీసీఎస్ లో ఉద్యోగాలు..

- April 15, 2022 , by Maagulf
కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలకు టీసీఎస్ లో ఉద్యోగాలు..

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) టెక్ హైరింగ్ ద్వారా ఐటీ రంగంలో రెండు సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న మహిళా ప్రొఫెషనల్స్ ను తీసుకోనుంది. ఆసక్తి అనుభవం ఉన్న మహిళా అభ్యర్దులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.TCS బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI), TCS కమ్యూనికేషన్స్, మీడియా, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (CMI) విభిన్న కెరీర్ అవకాశాలు ఉన్న మహిళా నిపుణులను నియమించుకోనుంది.మొత్తం పోస్టులు 42.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఆఖరు తేదీ.. 23 ఏప్రిల్ 2022

అర్హత: కనీసం 2 సంవత్సరాల సంబంధిత IT అనుభవం ఉన్న మహిళలు అర్హులు.వ్యక్తిగత కారణాల కెరీర్ లో గ్యాప్ తీసుకున్న మహిళా నిపుణులు అర్హులుగా పరిగణించబడతారు.

దరఖాస్తు చేసేటప్పుడు కెరీర్ విరామం సంబంధిత కారణాల వ్యవధిని హైలైట్ చేయడం తప్పనిసరి.ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది.దరఖాస్తు విధానం: అభ్యర్థులు https://ibegin.tcs.com/iBegin/register ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com