అబుదాబి.. ఫ్లాషింగ్ స్పీడ్ లిమిట్ ప్యానెల్స్ ఏర్పాటు
- April 16, 2022
అబుదాబి:ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ వేగ పరిమితులు వాహనదారులకు కన్పించేలా అబుదాబి పోలీసులు ఎమిరేట్ అంతటా ఇల్యూమినేటెడ్ ఇ-ప్యానెల్లు, కాషన్ బోర్డులను ఏర్పాటు చేశారు. వర్షం, బలమైన గాలులు, ఇసుక తుఫానులు, భారీ పొగమంచు సమయంలో వాహనదారులను సురక్షితమైన దూరం ఉంచాలని హెచ్చరించడానికి 80 కిమీ/గం ఫ్లాషింగ్ స్పీడ్ లిమిట్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేసినట్లు అబుదాబి పోలీసులు తెలిపారు. ప్రమాదకర వాతావరణ పరిస్థితుల్లో అబుదాబి ఎమిరేట్‌లో ట్రాఫిక్ భద్రత కోసం జాయింట్ కమిటీ నిర్దేశించిన వేగ పరిమితులను పాటించాలని వాహనదారులను పోలీసులు కోరారు. ప్రమాద నివారణకు వాతావరణ సూచనలను గమనించాలని, నిపుణులు సూచించిన చర్యలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







