కువైట్ ఫ్రైడే మార్కెట్‌లో 11,200 మందికి ఇఫ్తార్
- April 16, 2022
కువైట్: కువైట్ ఫ్రైడే మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక టేబుల్‌లో 11,200 మందికి పైగా ప్రజలు ఇఫ్తార్‌లో ఉపవాస దీక్ష విరమించారు. ఇందుకోసం అల్‌రాయ్‌లోని ఫ్రైడే మార్కెట్ లో పొడవైన ఇఫ్తార్ టేబుల్‌ను ఏర్పాటు చేశారు. యువకులు, అనేక ప్రైవేట్ కంపెనీలు, రెస్టారెంట్ల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పొడవైన ఇఫ్తార్ టేబుల్ ఆలోచనను "హ్యూమానిటీ వాలంటీర్" టీమ్ లీడర్ అలీ సలాహ్ కరమ్ రూపొందించారు. ఇంతకుముందు సౌక్ ముబారకియా ఫ్రైడే మార్కెట్‌లో ఇలాంటి ఇఫ్తార్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ సంవత్సరం 11,200 మందికి పైగా హాజరైన ఇఫ్తార్ ఇదే. ఫుడ్ బ్యాంక్, జంజామ్ మార్కెట్, "ఖధా అండ్ ఖుదౌద్" టీమ్, "కువైట్ ఇన్ అవర్ హార్ట్" టీమ్, ఫ్రైడే మార్కెట్ డిపార్ట్‌మెంట్, ఎమర్జెన్సీ సెంటర్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అసోసియేషన్, ఇస్లామిక్ కేర్ అసోసియేషన్ అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక రెస్టారెంట్లు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







