108 అడుగుల హనుమాన్ విగ్రహాన్నిఆవిష్కరించిన ప్రధాని మోడీ
- April 16, 2022
న్యూఢిల్లీ: నేడు హనుమాన్ జయంతి సందర్భంగా గుజరాత్ లోని మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తయిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ శనివారం ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు అంతకుముందు ప్రధాని చెప్పారు.
‘‘నేడు హనుమాన్ జయంతి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం.మోర్బిలో ఉదయం 11 గంటలకు 108 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరణ జరుగుతోంది.ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. హనుమాన్ జీ చార్ ధామ్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా నాలుగు ఎత్తయిన హనుమాన్ విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగా.. అందులో ఇది రెండోది.మరో వైపు నేడు దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతుండడం గమనార్హం.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







