ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- June 19, 2026
పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు గండికొడుతూ అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి(Strait Of Hormuz)ని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగడం, గల్ఫ్ ప్రాంతంలో అమెరికా బలగాల ఉనికిని నిరసిస్తూ ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలోని కీలక షరతులు అమలయ్యే వరకు ఈ దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేసింది. వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లు తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
ఈ తాజా పరిణామం వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతల తగ్గింపు ప్రక్రియకు పెద్ద సవాలుగా మారింది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వైదొలగడం, సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు పర్షియన్ గల్ఫ్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడమే తమ ప్రధాన షరతులని ఇరాన్ పేర్కొంటోంది. అయితే అమెరికా-ఇరాన్ ఒప్పందాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లాను అంతం చేయడమే తమ ఏకైక లక్ష్యమని ఇజ్రాయెల్ స్పష్టం చేయడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం మరింత క్లిష్టంగా మారింది.
అమెరికా-ఇరాన్ చర్చల తర్వాత హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయ చమురు సరఫరాలో అత్యధిక భాగం ఈ జలసంధి గుండానే సాగుతుండటంతో, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో మళ్లీ అలజడి మొదలైంది. ఈ సముద్ర మార్గం మూతపడటం వల్ల రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







