సోనియా, రాహుల్ గాంధీలతో ప్రశాంత్ కిశోర్ భేటీ
- April 16, 2022
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో నేడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎంపీ రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరిపోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యమేర్పడింది. కానీ.. రాబోయే గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే, గుజరాత్ పోల్స్‌పై చర్చించడానికే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. గుజరాత్‌తో పాటు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల విషయంలో బ్లూప్రింట్‌పై కూడా చర్చించే ఛాన్స్ ఉందని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికలు, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలు కూడా అధిష్ఠానం పీకే చేతిలో పెడతారని ప్రచారం జరుగుతోంది. అయితే.. పీకే శిష్యుడు సునీల్ కనుగోలుకు కూడా ఇదే తరహా బాధ్యతలు అప్పజెప్పబోతున్నారన్న ప్రచారమూ వుంది. మరి ఎవరిని వ్యూహం బరిలోకి దింపనున్నారో తెలియడం లేదు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







