అయోధ్య రామాలయం పై కీలక అప్డేట్...

- April 17, 2022 , by Maagulf
అయోధ్య రామాలయం పై కీలక అప్డేట్...

న్యూ ఢిల్లీ:ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ ఆలయంలో రామ్‌లల్లా ఎప్పుడు దర్శనం ఇస్తాడని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రామజన్మభూమి మందిర్‌ తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఈ విషయంపై స్పష్టతను ఇచ్చారు.ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణ పనులు దాదాపు 30శాతం పూర్తయినట్లు తెలిపారు. 2024 సంవత్సరంలో మకర సంక్రాంతి నాడు రామమందిరాన్ని ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.

2023 చివరి నాటికి రామజన్మభూమి ఆలయాన్ని ప్రారంభిస్తామని నేను ఇంతకు ముందు చెప్పానని, కానీ సూర్యుడు దక్షిణాయనంలో ఉండటంతో తేదీలు ఖరారు కాలేదని తెలిపారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన మకర సంక్రాంతి నాడు గొప్ప ఆలయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. నిర్మాణ పనుల పురోగతికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. రాముడు కూర్చునేందుకు ఆరు అడుగుల పొడవైన గ్రానైట్ కుర్చీని తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఆగస్టులో పునాది పనులు పూర్తయిన తరువాత ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు చంపత్‌ రాయ్‌ తెలిపారు.

అదే విధంగా రాతి చెక్కడం కూడా ప్రారంభించినట్లు తెలిపారు. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఫిబ్రవరి 2020లో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించబడ్డాయి. 2020 ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పదెకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం జరుగుతోంది. మూడు అంతస్తుల్లో ఆలయాన్ని నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com