భారత్‌లో గణనీయంగా పేదరికం తగ్గుముఖం: వరల్డ్ బ్యాంకు
- April 18, 2022
న్యూఢిల్లీ: భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గింది.మరీ ముఖ్యంగా గ్రామాల్లో పేదరికం బాగా తగ్గుముఖం పడుతున్నట్టు ప్రపంచబ్యాంకు తెలిపింది.భారత్‌లో పేదరికానికి సంబంధించి ప్రపంచబ్యాంకు పాలసీ రీసెర్చ్ వర్కింగ్ పేపర్‌ను విడుదల చేసింది.దీని ప్రకారం.. 2011-19 మధ్య కాలంలో దేశంలో తీవ్రమైన పేదరికం 12.3 శాతం తగ్గింది.2011లో 22.5 శాతంగా ఉన్న పేదరికం 2019కి 10.2 శాతం తగ్గింది. అలాగే, భారత్‌లో పేదరికానికి సంబంధించి అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) ఇటీవల ఓ వర్కింగ్ పేపర్‌ను విడుదల చేస్తూ.. భారత్ తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించిందని కొనియాడింది. ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేయడం ద్వారా వినియోగంలో అసమానతలను 40 ఏళ్లలో కనిష్ఠ స్థాయికి తెచ్చినట్టు ప్రశంసించింది.
ఇప్పుడు ప్రపంచబ్యాంకు కూడా ఇదే విషయాన్ని పేర్కొంది.2011లో గ్రామాల్లో 26.3 శాతంగా ఉన్న పేదరికం 2019లో 11.6 శాతానికి తగ్గినట్టు వివరించింది.అదే సమయంలో పట్టణాల్లో 14.2 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గింది.అంటే ఈ కాలంలో పేదరికం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 14.7 శాతం, 7.9 శాతం మేర తగ్గింది. చిన్నకమతాల రైతుల వాస్తవ ఆదాయం 2013-2019 మధ్య కాలంలో ఏటా 10 శాతం పెరిగిందని, ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల ఆదాయం అదే సమయంలో 2 శాతం మాత్రమే వృద్ధి చెందినట్టు ప్రపంచబ్యాంకు తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!







