భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- July 26, 2026
న్యూఢిల్లీ: బహ్రెయిన్–భారత్ మధ్య న్యాయ, న్యాయవ్యవస్థ, పెట్టుబడి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాలు కొత్త అవకాశాలపై చర్చించాయి. భారత పర్యటనలో భాగంగా కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ మారికే పత్రానీ పాల్సన్, కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్తో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెట్టుబడుల ప్రవాహాన్ని ప్రోత్సహించడం, న్యాయ, న్యాయవ్యవస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి ఆధునిక విధానాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
అలాగే సరిహద్దులు దాటి జరిగే పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం కల్పించడం, సంస్థాగత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, భవిష్యత్తులో ఉమ్మడి సహకార అవకాశాలను గుర్తించడం వంటి అంశాలపై ఇరు పక్షాలు అభిప్రాయాలు పంచుకున్నాయి. ఈ సమావేశంలో యూఎన్సీఐటీఆర్ఏఎల్ (UNCITRAL) కార్యదర్శి అన్నా జౌబిన్-బ్రెట్, భారత అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ డాక్టర్ పింకీ ఆనంద్, న్యూఢిల్లీలోని బహ్రెయిన్ రాయబార కార్యాలయ ప్రతినిధి మహదీ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భేటీ
- BRICS సదస్సులో ప్రధాని మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ ద్వైపాక్షిక భేటీ
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం
- 6 ఏళ్ల తర్వాత దిల్లీకి చైనా విమాన సర్వీసులు ప్రారంభం
- నేపాల్‌లో యూఏఈ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ ముమ్మర గాలింపు
- యూఏఈ నుంచి ‘నో ఇండియా ప్రోగ్రామ్’కు ప్రియదర్శిని ఎంపిక
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కొత్త నిబంధనలు..!!
- బిగ్ టికెట్లో భారతీయుడిని వరించిన అదృష్టం..!!
- సౌదీ అరేబియాలో కీలక చమురు పైప్‌లైన్ మూసివేత..!!
- కువైట్ విదేశాంగ మంత్రితో ఖతార్ ప్రధాని ఫోన్లో కీలక చర్చలు..!!







