హాంకాంగ్‌లో విమానాలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా
- April 18, 2022
న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చైనాలోని హాంకాంగ్‌లో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసింది.ఈ నెల 19 నుంచి 23 వరకు విమానాలను నడపడం లేదని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి అధికారులు కరోనా ఆంక్షలు విధించారు.దీంతోపాటు డిమాండ్ కూడా తక్కువగా ఉన్నదని ఈ నేపథ్యంలో విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు ప్రకటించారు.
భారత్ నుంచి హాంకాంగ్ రావాలనుకునేవారు 48 గంటల ముందే పరీక్షలు చేయించుకోవాలని, నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో భారత్‌తో పాటు ఎనిమిది దేశాల నుంచి విమానాల రాకపోకలపై హాంకాంగ్ రెండు వారాలపాటు ఆంక్షలు విధించింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







