భారత్ లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి..ఆదేశాలు జారీ
- April 18, 2022
న్యూ ఢిల్లీ: మరోసారి కరోనా విరుచుకపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా కేసులు అధికమౌతున్నాయి.వెయ్యి లోపే నమోదైన కోవిడ్ కేసులు ఆదివారం ఏకంగా 2000 మార్కును దాటింది.200 మరణాలు సంభవించడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. వివిధ రాష్ట్రాలను అలర్ట్ చేసింది.అందులో భాగంగా మాస్క్ కంపల్సరీ చేసింది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం.ఈ రాష్ట్రంలో గతంలో కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదు కావడంతో నిబంధనలు సడలించింది.కానీ.. తాజాగా కేసులు పెరుగుతుండడంతో యూపీ సర్కార్ అప్రమత్తమైంది. లక్నోతో పాటు దేశ రాజధాని పరివాహక ప్రాంతం పరిధిలోని ఆరు జిల్లాల్లో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని ఆదేశించింది.
కొత్తగా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. లక్నోతో పాటు ఘజియాబాద్, హాపూర్, మీరట్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్ షార్, బాగ్పాట్ జిల్లాల్లో ఈ నిబంధన అమల్లో ఉంటుందన్నారు. గౌతమ్ బుద్ధ నగర్ లో 65, ఘజియాబాద్ లో 20, లక్నో లో 10 చొప్పున కేసులు వెలుగు చూశాయి.ఇక భారతదేశ విషయానికి వస్తే.. ఆదివారం 2.6 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు చేయగా.. 2 వేల 183 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.ఇందులో అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 940 కేసులు వచ్చాయి. ఢిల్లీలో 517 కేసులు బయటపడ్డాయి.2114 మరణాల్లో కేరళ నుంచే 213 మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







