సౌదీ అరేబియా,ఒమన్ దేశాలకు విమాన సర్వీసులు పెంచిన స్పైస్‌జెట్

- April 19, 2022 , by Maagulf
సౌదీ అరేబియా,ఒమన్ దేశాలకు విమాన సర్వీసులు పెంచిన స్పైస్‌జెట్

న్యూ ఢిల్లీ: భారత్‌కు చెందిన లోకాస్ట్ క్యారియర్ స్పైస్‌జెట్ గల్ఫ్‌ లోని మస్కట్‌,రియాధ్,జెడ్డా నగరాలకు కొత్త విమాన సర్వీసులను ప్రకటించింది.కరోనా తర్వాత పరిస్థితులు అదుపులోకి రావడంతో ప్రయాణాలు పెరిగి డిమాండ్ మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకుందని ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు పెంచుతున్నట్లు ఈ సందర్భంగా స్పైస్‌జెట్ విమానయాన సంస్థ పేర్కొంది.అహ్మదాబాద్, ముంబై, కోజికోడ్‌ల నుంచి ఈ కొత్త సర్వీసులను నడపునున్నట్లు తెలిపింది.అహ్మదాబాద్-మస్కట్‌, ముంబై-రియాధ్, కోజికోడ్-జెడ్డా మధ్య కొత్త సర్వీసులు నడవనున్నాయి.

ఈ సర్వీసులను ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.ఎయిర్‌లైన్‌కు చెందిన BOEING-737, Q400 విమానాలను ఈ రూట్లలో నడపనున్నట్లు పేర్కొంది. ప్రయాణికుల నుంచి ఉన్న డిమాండ్‌తో పాటు అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే యోచనలో భాగంగా కొత్త సర్వీసులను తీసుకువస్తున్నట్లు ఈ సందర్భంగా స్పైస్‌జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శిల్పా భాటియా వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com