సౌదీ అరేబియా,ఒమన్ దేశాలకు విమాన సర్వీసులు పెంచిన స్పైస్‌జెట్
- April 19, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌కు చెందిన లోకాస్ట్ క్యారియర్ స్పైస్‌జెట్ గల్ఫ్ లోని మస్కట్,రియాధ్,జెడ్డా నగరాలకు కొత్త విమాన సర్వీసులను ప్రకటించింది.కరోనా తర్వాత పరిస్థితులు అదుపులోకి రావడంతో ప్రయాణాలు పెరిగి డిమాండ్ మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకుందని ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు పెంచుతున్నట్లు ఈ సందర్భంగా స్పైస్‌జెట్ విమానయాన సంస్థ పేర్కొంది.అహ్మదాబాద్, ముంబై, కోజికోడ్‌ల నుంచి ఈ కొత్త సర్వీసులను నడపునున్నట్లు తెలిపింది.అహ్మదాబాద్-మస్కట్, ముంబై-రియాధ్, కోజికోడ్-జెడ్డా మధ్య కొత్త సర్వీసులు నడవనున్నాయి.
ఈ సర్వీసులను ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.ఎయిర్‌లైన్‌కు చెందిన BOEING-737, Q400 విమానాలను ఈ రూట్లలో నడపనున్నట్లు పేర్కొంది. ప్రయాణికుల నుంచి ఉన్న డిమాండ్‌తో పాటు అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే యోచనలో భాగంగా కొత్త సర్వీసులను తీసుకువస్తున్నట్లు ఈ సందర్భంగా స్పైస్‌జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శిల్పా భాటియా వెల్లడించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







