కాబూల్‌లో బాంబు పేలుళ్లు.. 25 మంది విద్యార్థులు మృతి!
- April 19, 2022
కాబూల్:పశ్చిమ కాబూల్‌లో వరుస బాంబు పేలుళ్లు అలజడి సృష్టించాయి. హైస్కూళ్లే లక్ష్యంగా మూడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి.మంగళవారం ఏప్రిల్ 19న స్కూళ్ల వద్ద జరిగిన పేలుళ్ల ఘటనలో కనీసం 25 మంది విద్యార్థులు దుర్మరణం చెందినట్టు సమాచారం. ఈ మేరకు అప్ఘాన్ భద్రతా ఆరోగ్య అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.డజన్ల కొద్దీ గాయపడ్డారని తెలిపారు. పశ్చిమ కాబూల్‌లోని ముంతాజ్ పాఠశాల వద్ద తొలి పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పలువురు గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
రాజధానిలోని దష్త్-ఎ-బర్చి జిల్లాలోని పాఠశాల సమీపంలో రెండో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మరో ఆరుగురు మరణించారని, డజన్ల కొద్దీ జనం గాయపడ్డారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పేలుళ్లలో కనీసం నలుగురు మరణించారని, 14 మంది గాయపడ్డారని ఆసుపత్రి నర్సింగ్ విభాగం అధిపతి ఒకరు తెలిపారు.
పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో షియా హజారా కమ్యూనిటీకి చెందిన చాలా మంది నివాసితులు ఉన్నారు. ఇస్లామిక్ స్టేట్‌తో సహా సున్నీ మిలిటెంట్ గ్రూపులు తరచుగా వీరిపై దాడులకు పాల్పడుతుంటారు. ప్రస్తుతం జరిగిన ఈ మూడు బాంబు పేలుళ్లలో భారీగా ప్రాణనష్టం జరిగిందని కాబూల్ కమాండర్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ అన్నారు. అయితే ఇప్పటివరకూ ఈ వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించలేదు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







