యూఏఈ పాఠశాలల్లో కార్యకలాపాలు పునఃప్రారంభం
- April 22, 2022
యూఏఈ: కొత్త కోవిడ్-19 భద్రతా నియమాల ప్రకారం.. యూఏఈలోని పాఠశాలలు ఈ రోజు నుండి అన్ని కార్యకలాపాలు, ఈవెంట్‌లను తిరిగి ప్రారంభించనున్నాయి. టీకాలు వేసిన, టీకాలు వేయని విద్యార్థులు, సిబ్బందిని అనుమతించనున్నారు. టీకాలు తీసుకోని వారికి అల్ హోస్న్ యాప్‌లో గ్రీన్ స్టేటస్ అమల్లో ఉంటుంది. మూసి ఉన్న ప్రదేశాలలో.. బస్సులలో ప్రయాణాల సమయంలో తప్పనిసరిగా ఫేస్ మాస్క్ లు ధరించాలి. ముందుజాగ్రత్త చర్యలకు అనుగుణంగా తల్లిదండ్రులు ఈవెంట్‌లు, కార్యకలాపాలకు హాజరు కావచ్చు. వసతి గృహాలలోకి ప్రవేశించాలనుకునే విశ్వవిద్యాలయ విద్యార్థులందరికీ ప్రతి నెలా ఒకసారి PCR పరీక్షను నిర్వహించాలి. కొత్త అప్‌డేట్ ప్రకారం.. 16 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న విద్యార్థులు, విద్యా సిబ్బంది, సిబ్బందితో పాటు విద్యా సంస్థల సందర్శకులందరికీ గ్రీన్ పాస్ ప్రోటోకాల్‌ను అనుసరించడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







